హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలి'

WG: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నరసాపురం 22వ వార్డులో ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం ధర్నా, నిరసన నిర్వహించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడుతూ.. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలకు అనుగుణంగా ప్రజల ఆదాయాలు పెరగడం లేదని విమర్శించారు.