ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి తెలిపారు. నేటి నుంచి 16 వరకు సచివాలయాల్లో ఆన్‌లైన్ నమోదు, e-KYC చేసుకోవచ్చని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు సచివాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం


