హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సమయం ముగియకముందే తాళం!

HNK: ఐనవోలు మండలంలోని కొండపర్తి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి సోమవారం సాయంత్రం 4 గంటలకే తాళం వేసి సిబ్బంది వెళ్లిపోయారని స్థానికులు ఆరోపించారు. విధుల సమయం పూర్తికాకముందే కేంద్రాన్ని మూసివేయడంతో వైద్యం కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఘటనపై అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.