హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర వాసులకు పోలీసుల హెచ్చరిక

VSP: కేవైసీ పత్రాల దుర్వినియోగం, లోన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు, కమిషన్ల పేరుతో వచ్చే మోసాలను నమ్మవద్దని వైజాగ్ సిటీ పోలీసులు హెచ్చరించారు. బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇవ్వడం, అమ్మడం చట్టరీత్యా నేరమని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని స్పష్టం చేశారు. ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని కోరారు.