హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి: ఎస్పీ

ATP: అనంతపురం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ పి. జగదీష్ ప్రజల నుంచి 71 వినతులను స్వీకరించారు. బాధితుల అర్జీలను నిర్ణీత వ్యవధిలో విచారించి చట్టపరిధిలో న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగేలా పనిచేయాలన్నారు.