KNR: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుండ్లపల్లి ఎక్స్‌రోడ్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా రేణిగుంట వాగు నుంచి సిద్దిపేటకు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలింపు వాహనం పట్టివేత


