హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అసంపూర్తి పనులతో పడకేసిన పారిశుధ్యం

NTR: జగ్గయ్యపేటలోని పలు వార్డుల్లో డ్రైనేజీ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. విష్ణుప్రియానగర్, శాంతనగర్ ప్రాంతాలలో నిల్వ నీటితో దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.