కృష్ణా: కొత్త పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెడన మండలంలోని గ్రామ సచివాలయాల వద్ద సందడి నెలకొంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో చేరుకుని దరఖాస్తులు సమర్పించేందుకు బారులు తీరారు. కొన్ని సచివాలయాల్లో వైసీపీ, టీడీపీకి చెందిన స్థానిక నాయకులు దరఖాస్తుదారులకు సహకరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పింఛన్ల దరఖాస్తులకు పోటెత్తిన జనం


