హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఏసీఎస్ ద్వారా ఎరువులు పంపిణీ

AKP: నక్కపల్లి మండలం గొడిచెర్ల పీఏసీఎస్ ద్వారా సోమవారం నుంచి రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నారు. గత ఆరేళ్లుగా ఆర్బీకేల ద్వారా ఇచ్చేవారని పీఏసీఎస్ ఛైర్మన్ దార్ల కృష్ణ తెలిపారు. సొసైటీ ద్వారా ఎరువుల సప్లై చెయ్యాలనే ఉద్దేశ్యంతో హోంమంత్రి అనిత సహకారంతో లైసెన్స్ పొంది ఎరువులను రైతులకు విక్రయిస్తున్నామన్నారు. రైతులకు సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు.