హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి లేక గిరిజనుల అవస్థలు

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం వాడబాయి గిరిశిఖర గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. రాళ్లు పైకి తేలి ఉండడంతో అత్యవసర సమయంలో గ్రామం నుంచి బయటకు రావడం ప్రమాదకరంగా మారిందని తెలిపారు. రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.