హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంతరాయం రాకుండా చూడాలి'

AKP: అచ్యుతాపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. తాగునీరు, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, రోడ్డు ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.