హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు'

KMR: గణేష్‌ విగ్రహాలను మండపాలకు తీసుకువచ్చే సమయంలో,నిమజ్జనం సందర్భంగా సౌండ్‌ బాక్స్‌లు, DJ సిస్టమ్‌లు వినియోగించరాదని భిక్కనూర్‌ SI అనిల్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి DJలు, సౌండ్‌ బాక్స్‌లు ఏర్పాటు చేస్తే వాటిని సీజ్‌ చేయడంతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు.