హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేంద్ర వేతన సలహా మండలిలో సీఐటీయూకు చోటివ్వాలి'

NRML: కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో సీఐటీయూను చేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న సీఐటీయూకు బోర్డులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.