హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులతో కిటకిటలాడిన బుగ్గ ఆలయం

VKB: శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని పూలు, మామిడి తోరణాలతో సుందరంగా అలంకరించారు. భక్తుల హర హర మహాదేవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రద్దీ నియంత్రణకు అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.