ATP: రైతుల సాగునీరు, విద్యుత్, కరువు సమస్యలపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పెరూరు డ్యామ్‌ను నీటితో నింపాలని, లో-వోల్టేజ్ సమస్య పరిష్కరించి ఉచిత విద్యుత్ సక్రమంగా అందించాలని కోరారు. కరువు, విద్యుత్ సమస్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెరూరు డ్యామ్‌ను నీటితో నింపాలి: తోపుదుర్తి


