హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SRCL: సీజనల్ వ్యాధుల నియంత్రణపై DMHO డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సమీక్ష నిర్వహించారు. జ్వరాలు అధికంగా ఉన్న గ్రామాల్లో రక్త నమూనాల సేకరణ వేగవంతం చేసి వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించి, దోమల ఉత్పత్తి కేంద్రాల్లో యాంటీ లార్వల్ చర్యలు చేపట్టాలని, హాస్టళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.