MHBD: నర్సింహులపేట మండలం కొమ్ములవంచ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి ఏర్పుగొండ వెంకన్న సొంత ఖర్చు(రూ.36 వేల)తో 45 మంది విద్యార్థులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. చదువుతోనే పేదరికం, సమస్యలు దూరమవుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం వీరేశం.. వెంకన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్కరించారు. ఉప సర్పంచ్ రామ్మూర్తి, వార్డు సభ్యుడు బుచ్చాలు, తదితరులు పాల్గొన్నారు.


