SRD: కోహిర్ మండలం బడంపేట ఆలయంలో భక్తులతో ఆధ్యాత్మిక శోభ సందడి నెలకొంది. నేడు శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు భ్రమరాంబ సమేత రాచన్న స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి దర్శించుకున్నారు. అదేవిధంగా ఇవాళ లక్ష బిల్వార్చన మహోత్సవంలో స్థానిక భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో లింగార్చన, బిల్వపత్రాలతో అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
ఘనంగా లక్ష బిల్వార్చన మహోత్సవం


