హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

కర్నూలు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సోమవారం 104 ఫిర్యాదులు అందాయని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్న ఆయన, ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులపై అధికారులు త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.