హైదరాబాద్: 28°C
తెలంగాణ

అస్వస్థతతో యువకుడు మృతి

MDK: కౌడిపల్లి మండలం కొట్టాలకు చెందిన మంగలి ప్రవీణ్ (25) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి భార్యాపిల్లలతో జీవిస్తున్న అతను, గత రెండు రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ కన్నుమూశాడు. ఉపాధికి వెళ్లిన యువకుడు అకస్మాత్తుగా మృతి చెందడంతో స్వగ్రామమైన కొట్టాలలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.