హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికుల నేర చరిత్రపై పోలీసుల ఆరా

TPT: బ్రహ్మోత్సవాల భద్రత నేపథ్యంలో తిరుమలలోని షాపులు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న పాత, కొత్త కార్మికుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కార్మికుల నేర చరిత్రను ధ్రువీకరించి, పూర్తి వివరాలను సకాలంలో నమోదు చేయాలని ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు యాజమాన్యాలకు సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డయల్‌-112కు సమాచారం ఇవ్వాలన్నారు.