ADB: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుడిహత్నూర్ MPDO ఇంతియాజ్ అన్నారు. సోమవారం మండలంలోని తోషం తండా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించటం జరుగుతుందని పేర్కొన్నారు. సర్పంచ్ జితేందర్, సెక్రటరీ సురేందర్, దౌలత్ రావ్, రామ్ కిషన్ ఉన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'


