హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ఇంటింటి సర్వే: కలెక్టర్

ATP: జిల్లాలో కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది ప్రతీ ఇంటిని సందర్శించి వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, పీహెచ్‌సీలలో ఉచితంగా ఎండిటి మందులు అందించాలన్నారు.