MLG: UNESCO గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలో 3 శతాబ్దాల తర్వాత సంపూర్ణ నిత్య జలాభిషేకం నేటి(సోమవారం) నుంచి పునరుద్ధరించబడింది. 17వ శతాబ్దపు భూకంపం వల్ల సోమసూత్రం మూసుకుపోయి ఈ పూజ ఆగిపోయింది. ఎలాంటి పురాతన నిర్మాణానికి నష్టం వాటిల్లకుండా, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అధికారులు అడ్డంకులను తొలగించి ఈ చారిత్రక పూజా కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించారు.
తెలంగాణ
రామప్పలో 300 ఏళ్ల తర్వాత జలాభిషేకం


