హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్వారకాతిరుమల ఆలయ ఆదాయం వివరాలు

ELR: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 18 రోజులకు కానుకల ద్వారా మొత్తం రూ. 2,03,75,763 నగదు ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బంగారం, వెండి & విదేశీ కరెన్సీ, నగదుతో పాటు 104 గ్రాముల బంగారం, 2.410 కిలోల వెండి లభించాయన్నారు. ఈవో వి.త్రినాధరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.