హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరణ

MDK: మనోహరాబాద్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ గ్రామాల నుంచి మొత్తం 8 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. రంగాయిపల్లి నుంచి రెండు, కాళ్లకల్ నుంచి ఆరు ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.