బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ V. వినోద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి తమ వినతులు తెలిపేందుకు వచ్చిన ప్రజల వద్ద నుంచి ఆయన నేరుగా అర్జీలను స్వీకరించారు. బాధితుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న కలెక్టర్, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్.


