హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనేరు ఆక్రమణలపై నిరసన

NTR: నందిగామ శ్రీ రామలింగేశ్వర స్వామి కోనేరు ఆక్రమలు తొలగించాలని కోరుతూ హిందూ సంఘాలు కోనేరు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం నందిగామ శివాలయం ఎదురుగా రిలే దీక్షలో కూర్చున్నారు. అధికారులు స్పందించి కోనేరు ఆక్రమణలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.