హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగు దాటేందుకు వెదురు వంతెనే దిక్కు

VKB: పరిగి నియోజకవర్గం చిగురాల్‌పల్లిలో వాగు దాటేందుకు సరైన మార్గం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ తాత్కాలిక వెదురు వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాలు కురిస్తే వంతెన దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు.