హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 9న మండల సమీక్షా సమావేశం

గుడిహత్నూర్ మండలంలో బుధవారం ఉదయం 11 గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఇంతియాజ్ తెలిపారు. సమావేశానికి సర్పంచులు, మండల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.