హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు: బీజేపీ

W.G: ఈనెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నెల రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు బీజేపీ పట్టణ పడమర విభాగం ఇన్‌ఛార్జ్ రామ్మూర్తి, అధ్యక్షులు ప్రసాద్ రావు అన్నారు. భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ పడమర విభాగం మండల కార్యవర్గ పదాదికారుల సమావేశాన్ని నిర్వహించారు. బూత్ స్థాయిలో కమిటీలను పూర్తిగా వేసుకోవాలన్నారు.