హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీని ధరల పతనం.. రైతుల్లో ఆందోళన

KDP: చీని కాయల ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 నెలల క్రితం టన్ను చీని కాయలకు రూ.లక్ష వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.15 వేలకే పరిమితమైంది. దీంతో మార్కెట్‌కు చీనిని తీసుకెళ్లినా గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చీని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.