హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఉచితంగా సైకిల్స్ అందజేత

W.G: భీమవరంలోని 20 మంది పేద విద్యార్థులకు రాజ్ ట్రస్ట్, పూర్వ విద్యార్థులు, స్నేహితుల సహకారంతో సోమవారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఉచితంగా సైకిళ్లను అందించారు. సుదూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం రాజ్ ట్రస్ట్, పూర్వ విద్యార్థుల కలిసి ఉచితంగా సైకిళ్లను అందించడం గొప్ప విశేషమని ఆయన అన్నారు.