హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

WGL: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన నెక్కొండ మండలం బొల్లికొండలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అఖిల(24) ఐదు రోజుల క్రితం పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.