హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి'

ములుగు జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో మండపాలకు పోలీస్ అనుమతి తప్పనిసరని, జూదం, డీజేలకు అనుమతి లేదన్నారు. మట్టి విగ్రహాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు, వైద్యం, అగ్నిమాపక ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.