హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేనేత కార్మికుల సమస్యలు తెలుసుకున్న కేతిరెడ్డి

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని 8వ వార్డు సీపీఐ కొట్టాల నుంచి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక చేనేత కార్మికులను కలిసి, వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. చేనేత రంగానికి ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కోరారు.