MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ఆఖరి శ్రావణ సోమవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేసి, వాయనాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమలు పంచుకున్నారు. అమ్మవారిని ప్రార్థిస్తూ తీర్థప్రసాదాలు అందజేశారు. పూజలతో గ్రామంలో పండుగ శోభ సంతరించుకుంది.
తెలంగాణ
కోనాపూర్‌లో ముగిసిన శ్రావణ పూజలు


