హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

VSP: ఈనెల 13న వేమన మందిరంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించనున్నట్లు నేషనల్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ అధ్యక్షుడు పి.నారాయణ తెలిపారు. అక్కయ్యపాలెంలో సోమ‌వారం జరిగిన సమావేశంలో వేడుకల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు మట్టి విగ్రహాలు, వ్రతకల్ప పుస్తకాలు, పండ్ల మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.