హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య'

ADB: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ బోథ్, సోనాల మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.