MBNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు అరెస్ట్‌ను ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామ్ చందర్ రావును అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
తెలంగాణ
రామ్ చందర్ రావు అరెస్ట్ దుర్మార్గం: ఎంపీ


