హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రధాని మోదీ చిత్రపటం ఏర్పాటు చేయాలి'

KMR: నాగిరెడ్డిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో MPDO గంగాధర్‌కు మండల BJP నాయకులు వినతి పత్రం ఇచ్చారు. మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని చిత్రపటం లేకపోవడం బాధాకరమని అన్నారు. ఇకనైనా ప్రధాని చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.