NTR: జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని 11 కిలోల వెండి, 40 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీకి గురైన వాటిలో అమ్మవారి బంగారు మంగళసూత్రాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
చెన్నకేశవ స్వామి ఆలయంలో చోరీ


