హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పెన్షన్ నమోదుకు అర్జీదారుల రద్దీ

NDL: బేతంచర్ల సచివాలయం నూతన పెన్షన్ నమోదుకు వచ్చిన అర్జీదారులతో కిటకిటలాడింది. ప్రభుత్వం నూతన పెన్షన్ నమోదు ప్రక్రియ ప్రారంభించడంతో సచివాలయాలకు దరఖాస్తుదారులు తరలివస్తున్నారు. అధికారులు సమయానికి అందుబాటులో ఉండి పెన్షన్ నమోదు చేయాలని కమిషనర్ హరిప్రసాద్, ఎంపీడీవో ఫజల్ రెహమాన్ ఆదేశించారు. అర్హత పత్రాలతో సచివాలయానికి వచ్చి పెన్షన్ కోసం నమోదు చేసుకోవాలన్నారు.