హైదరాబాద్: 28°C
తెలంగాణ

చీడపీడల నివారణపై విద్యార్థులకు అవగాహన

KNR: హుజూరాబాద్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఏవో భూమిరెడ్డి టమాటా, బెండ, బంగాళదుంప పంటలను ఆశించే పురుగులు, వాటి వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలను వివరించారు. విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భూమిరెడ్డిని సన్మానించారు.