హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరికొండలో ఉచిత వైద్య శిబిరం

JGL: కథలాపూర్ మండలం సిరికొండలో డా. సింధూజ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి మందులు అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.