హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

కృష్ణా: గన్నవరం మండలం గోపవరపుగూడెంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో నాగ అంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోదరులు సతీష్ బాబు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించేలా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.