హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాప్రతినిధులపై దాడిపై మెచ్చా నిరసన

BDK: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడికి నిరసనగా అన్నపురెడ్డిపల్లిలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్న తీరు దారుణమన్నారు.