WNP: అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ సోమవారం కొత్తకోట పట్టణ చౌరస్తాలో మండల, పట్టణ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని నాయకులు విమర్శించారు. అరెస్టు చేసిన నేతలను విడుదల చెయ్యాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టులకు నిరసన


