హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి అండగా ప్రభుత్వం '

KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషితో 13వ వార్డులో వీధిలైట్ల స్తంభాల రిపేరుకు నిధులు మంజూరు అయ్యాయి. కాగా నేడు ఈ పనులకు 13వ వార్డు కౌన్సిలర్ విజయ సీతారాములు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ ఛైర్మన్ సీతారాములు పాల్గొన్నారు. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కౌన్సిలర్ పేర్కొన్నారు.