హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం పోరాడుతుంటే అరెస్టులా?

HYD: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న తనను 10 రోజుల్లో 4వ సారి అరెస్టు చేయడంపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం మాని, వారికోసం ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.